news
 
Latest News   
 
1
తెలంగాణ నిరుద్యోగులకి గుడ్ న్యూస్.
తెలంగాణ నిరుద్యోగులకి గుడ్ న్యూస్. జాబ్స్ జాతర కొనసాగనుంది. ఇప్పటికే గ్రూప్స్ 2 ద్వారా వెయ్యికి పైగా ఉద్యోగాలని భర్తి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పరీక్షలు నవంబర్ లో జరగనున్నాయి. అయితే, దసరా నుంచి కొత్తగా రూపుదిద్దుకొన్న 31జిల్లాల తెలంగాణ అవరాలని తీర్చేందుకు మరింత మంది ఉద్యోగులు అవసరం కానున్నారు. ఈ విషయాన్ని జిల్లాల ఏర్పాటుకు ముందే గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించింది. అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 4,077 పోస్టుల భర్తీకి సిద్ధమైంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఆమోదం తెలిపింది. ఇందులో ఎక్కువగా రెవెన్యూ, పోలీస్ జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి. శాఖల వారీగా భర్తీ చేచేయనున్న పోస్టుల వివరాలు : * రెవెన్యూ – 2,109 * పోలీస్ – 1,800 * పాఠశాల విద్య – 85 * అగ్నిమాపక విభాగం – 54 * వ్యవసాయ శాఖ – 25 * ఆర్ అండ్ బీ – 4 ‘ఆర్ఆర్ బి ‘ లో భారీగా ఉద్యోగాలు.. RRB-Jobsనిరుద్యోగులకు తీపి కబురు తెలిపింది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్(RRB). అతి త్వరలోనే 23,801 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుందని వార్త చెప్పి అందరికి సంతోషాన్ని కలుగచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2017లో అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. వీటి కోసం నవంబర్ 15 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు స్వీకరించనున్నారు. రాత పరీక్ష వచ్చే ఏడాది జనవరి లేదా మార్చిలో ఉంటుందని తెలుస్తుంది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆర్ ఆర్ బీ రిక్రూట్ మెంట్ లలో భాగంగా సికింద్రాబాద్ డివిజన్ లో 3210 ఉద్యోగ ఖాళీలు ఉండడం విశేషం. పూర్తి వివరాలు.. మొత్తం పోస్టులు: 23,801 సికింద్రాబాద్ జోన్ ఖాళీలు: 3210 ఆన్ లైన్ లో ధరఖాస్తు మొదలు: 15-11-2016 (అంచనా) చివరి తేది: 01-12-2016 (అంచనా) రాత పరీక్ష: జనవరి లేదా మార్చి 2017 (అంచనా)
Published on Friday, October 28, 2016

 

First Previous 1 Next Last 
 
   
Rewards Achiever List  
 
Top Achiever List  
 
PRIMA
vijayawada
SUCCESS
SUCCESS
SUCCESS
SUCCESS
SUCCESS
TMAHALAXMI
VUDIMUDI SRINIVASARAO
SVIJAYA LAXMI
LONKALA VINEEL
KARIMNAGAR